ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా…ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్…

తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు చిన్నతనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సెర్చింగులు చేస్తుంటారు. వారు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ చిన్ననాటి ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ బుర్రలకు పదును పెడుతూనే ఉంటారు. అలాంటి ఒక ఫొటోనే ఇప్పుడు నెట్టంట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టి టక్కున పేరు చెప్పండి. కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారే.. ఈ పిక్ లో ఉన్న చిన్నదే పెరిగి పెద్దదై 2018లో ఇయర్ ఆఫ్ ది సెలబ్రెటీగా కుర్రకారు మనుసులను దోచుకుంది.

ఈమె గురించి తెలుసుకునేందుకు గూగుల్ తెగ బిజీ అయిపోయింది అనడంలో కూడా సందేహం లేదు. దీంతో ఆమె స్టార్ సెలబ్రెటీ అయ్యింది. సినిమాల్లో కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇంకేం బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ర్టీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది. కని ఆమెకు అవి పెద్దగా కలిసి రాలేదు. హీరోయిన్ గా చాలా బిజీ అయిన వారిలో ఈమె ముందు వరుసలో ఉంది. ఏ మాత్రం టైం దొరికినా సోషల్ మీడియాలో అమ్మడు సందడి చేస్తూనే ఉంటుంది. 

మూవీ షూటింగ్ దశలోనే ఉండగానే కుర్రకారును తన వైపు తిప్పుకుంది. ఆమె ఫాలోయింగ్ గమనించిన దర్శక, నిర్మాతలు మొదట మంచి స్కోపున్న పాత్రలు ఇచ్చారు. ‘తనహా’ అనే ఒక మళయాలం సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ చేసిన ప్రియా వారియర్ ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో హీరోయిన్ తన అరంగేంట్రం మొదలు పెట్టారు. ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా ప్రారంభ దశలో ఉండగానే అందులో సన్నివేశంలో భాగంగా ‘హీరోకు కన్ను కొడుతూ చేతి రెండు వేళ్లతో గన్ షాట్’ సీన్ కుర్రకారును ఒక కుదుపు కుదిపింది. దీంతో సెర్చింజన్ హీటెక్కింది. అసలు ఎవరీ క్వీన్ పవర్ ఫుల్ ఎక్స్ర్పెషన్స్, చూడచక్కనైన అందం అంటూ వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా రిలీజై ఆశించినంత ఆడకున్నా అమ్మడికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీని తర్వాత నితిన్ తో చెక్ లో చిన్న పాటి క్యామియో రోల్ చేసింది.

‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’ సినిమాలో నటించింది. ఇది కూడా అంతగా ఆడలేదు. ఇతర భాషల్లో ఫాలోవర్స్, మంచి క్రేజ్ ఉండడంతో వరుస సినిమా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. హీందీ, కన్నడ, మళయాలం సినిమాలతో ఇప్పుడు ఈమె బిజీగానే ఉంది. అంద బిజీగా ఉంటూ అభిమానుల కోసం అందాల ట్రీట్ ను అమ్మడు మరిచి పోనేలేదు. ట్విటర్, ఇన్స్ ట్రా, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియాలో కొనసాగిస్తూనే ఉంటుంది. ఇంత చెప్పినా ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా ఆమే ప్రియా ప్రకాశ్ వారియర్. చిన్న ముద్దులొలికే మోముతో చిన్ పై చేతి పెట్టి, బుగ్గన దిష్టి చుక్కక పెట్టి చిల్చున్న చిన్నారే మన అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *