సోషల్ మీడియాలో హాట్ అందాలు ఆరబోస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. అందుకోసమేనా….వీడియో వైరల్


ప్రియా వారియర్ పరిచయడం అక్కర్లేని పేరు. ఒక్క కన్నుగీటుతో సెర్చింజన్లను పరుగులు పెట్టించిన కేరళా భామ. అంత ఫాలోయింగ్, అంతటి క్రేజ్ సంపాదించుకున్నా ముద్దుగుమ్మను వెండితెర సక్సెస్ మాత్రం వరించడం లేదు. ఆమె నటించిన మొదటి సినిమా ‘ఒరు అదర్ లవ్’ బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అటు తర్వాత వచ్చిన కొన్ని మూవీలతో కూడా ఆమెకు అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో అవకాశాలు చాలా వరకు తగ్గాయి.

తెలుగులో ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’, చెక్ లో చిన్నపాటి రోల్ చేసినా  అవి కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. అయినా ఫ్యాన్స్ ను అలరించేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజిగా ఉంటుంది ఈ చిన్నది.

ఆ మధ్య లెటెస్ట్ గా పెట్టిన ఆమె వీడియో, పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కేరళాలోని త్రిస్సూర్ లో 28 అక్టోబర్, 1999లో జన్మించింది. ఆమె తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఉద్యోగి. త్రిస్సూర్ లోని సాందీపని విద్యానికేతన్ లో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె, స్థానిక విమలా కాలేజీలో కామర్స్ పూర్తి చేసింది. 

రీసెంట్ గా తను పెట్టిన పిక్స్ లో సముద్ర తీరంలో నల్లటి చీర కట్టిన ఈ బ్యూటీ సందడి చేస్తూ, ఒద్దికైన అందాలతో దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోజు రోజుకు ఫాలోవర్స్ ను పెంచుతున్నాయి. సినీ ప్రపంచంలో అవకావాలు తగ్గుతుండడంతో సోషల్ మీడియా వైపు దృష్టి పెట్టించి చిన్నది. హాయిగా గ్లామర్ షోలు చేస్తూ పాపులారిటీని కాపాడుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. 

‘నీ వానం నాన్ మఝాయ్’ (2018 రిలీజ్) కంటే ముందే మంచి స్టార్ డమ్ తెచ్చకున్న బ్యూటీకి సిల్వల్ స్ర్కీన్ మాత్రం ఎందుకు కలిసి రావడం లేదంటూ కుర్రకారు చర్చించుకుంటున్నారు.

ఫేమస్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన చెక్ లో ఆమె నటించింది. అది కూడా పెద్దగా ఆడలేదు. వెండితెరపై ఒక వెలుగు వెలగాలని వచ్చిన ఈ కేరళా చిన్నదానికి మంచి అవకాశాలు మాత్రం రావడం లేదు.

అప్పట్లో సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ట్రోల్స్ ను తట్టుకోలేక ఇన్ స్టా నుంచి అకౌంట్ ను తొలగించుకొని దూరంగా ఉంది. ప్రతి ఫేమస్ హీరోయిన్ పై ఇలాంటివి సహజమేనని భావించి తన అభిమానుల కోసం మళ్లీ సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. కానీ ఆమె ఫాలోవర్స్ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతూనే ఉన్నారు.   దాదాపు 7.1 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నది. గతంలో ఈ బ్యూటీపై వచ్చిన ట్రోల్స్ ను భరించలేక ఇన్ స్టా నుంచి తప్పుకుంది. చాలా రోజుల వరకు స్తబ్ధంగా ఉంది. ఈ మధ్యే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 హిందీ, ఒక మలయాళీ చిత్రాలు ఉన్నట్లు చెప్తోంది. అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి కేరళ చిన్నది వెండితెరపై కూడా సక్సెస్ కావాలని అందరం కోరుకుందాం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *