సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే చాల మంది నటి నటుల,సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు మరియు వీడియోలు చాలానే మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.తమకు బాగా ఇష్టమైన నటి నటుల చిన్ననాటి ఫోటోలు చూడడానికి అభిమానులు కూడా చాల ఆసక్తి చూపిస్తుంటారు.అలాగే సెలెబ్రెటీలు కూడా సోషల్ మీడియా లో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తమ చిన్ననాటి ఫోటోలు మరియు వీడియోలు వాటికి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
ఇక అభిమానులు కూడా తమకు నచ్చిన స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు కనిపిస్తే చాలు వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తారు.ఈ క్రమంలోనే ఇప్పటివరకు దాదాపుగా స్టార్ హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి.తాజాగా ఇప్పుడు ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బూరెబుగ్గలతో,క్యూట్ స్మైల్ తో ఉన్న చిన్నారి ఫోటో ఒకటి ఇప్పుడు అందరిని బాగా ఆకట్టుకుంటుంది.మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ హీరోయిన్.
ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ గా ఉంది.గత సంవత్సరం వరుస సినిమాలతో థియేటర్ లలో ప్రేక్షకులను అలరించింది.ఇప్పటి వరకు చాల సినిమాలు చేసిన కూడా అనుకున్నంతగా క్లిక్ అవలేదు.కానీ తన అందంతో,నటనతో కుర్రకారు కు ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ హీరోయిన్ ఎవరో కాదు విజయ్ దేవరకొండ కు జోడిగా టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్.గత సంవత్సరం ఈ అమ్మడు తిమ్మరుసు,ఎస్ ఆర్ కల్యాణ మండపం,గమనం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.ఇటీవలే కరోనా బారిన పడిన ప్రియాంక క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది.
View this post on Instagram