ప్రియాంక జవల్కర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ప్రియాంక కు చాల క్రేజ్ ఉందని చెప్పచ్చు.తాజాగా ఈమె ట్రెడిషనల్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో ప్రియాంక ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉండడం గమనించవచ్చు.అతడే నా లవ్ అంటూ ప్రియాంక ఈ ఫోటోలకు కామెంట్ చేయడం జరిగింది.అయితే ప్రియాంక ముందు కూర్చొని ఉన్న వ్యక్తి క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక జవల్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉంది.మొదటి రెండు సినిమాలతో హిట్ అందుకొని కుర్రకారు ఫేవెరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు.తన అందంతో నటనతో ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోయిన్లకు పోటీ పడుతుంది.2017 సంవత్సరంలో తెలుగులో కలవరమాయే అనే చిత్రం తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక.అయితే టాక్సీవాలా అనే చిత్రంతో ప్రియాంక కు మంచి గుర్తింపు వచ్చింది.2018 లో రిలీజ్ అయినా టాక్సీవాలా చిత్రంలో ప్రియాంక హీరో విజయ్ దేవరకొండకు జోడిగా నటించి అందరిని అలరించింది.ఈ చిత్రంతో ఆమె మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
అప్పటి నుంచి ప్రియాంక హాట్ గా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటుంది.ఈమెకు కుర్రాళ్లలో బాగా ఫాలోయింగ్ ఉంది.ప్రియాంక 1992 లో ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురంలో జన్మించడం జరిగింది.ప్రియాంక హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ లో గ్రాడ్యువేషన్ పూర్తి చేయడం జరిగింది.తాజాగా ప్రియాంక రెస్టారెంట్ లో ఒక వ్యక్తి తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది.