పుష్ప 2 ఇలా ఉండబోతుంది అంటూ చెప్పిన రష్మిక మందాన…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతమైన యాక్టింగ్ తో సుకుమార్ దర్శకత్వంలో రిలీజ్ అయినా చిత్రం పుష్ప ది రైజ్.పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.రష్మిక మందాన శ్రీవల్లి పాత్రలో నటిగా మరో మెట్టు పైకి ఎక్కిందని చెప్పవచ్చు.ఇక సునీల్,యాంకర్ అనసూయ పుష్ప మొదటి భాగంలో కనిపించింది తక్కువే అయినా కూడా పుష్ప రెండవ భాగంలో ఎక్కువగా కనిపిస్తారు అని వార్తలు వస్తున్నాయి.ఇటీవలే పుష్ప ఓటిటిలో రిలీజ్ అయ్యి తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.

ఇప్పుడు ప్రేక్షకుల ద్రుష్టి పుష్ప రెండవ భాగం మీద ఉంది.పుష్ప మొదటి భాగంలో ఒక సాధారణ కూలి సిండికేట్ కు బాస్ ఎలా అయ్యాడు అనే దాని గురించి ఉంది.ఇక పుష్ప రెండవ భాగంలో యెర్ర చందనం రాజ్యాన్ని పుష్ప రాజ్ ఎలా ఏలాడు అనే దాని గురించి చూపించబోతున్నారు సుకుమార్.కేశవ పాత్రతో కూడా ట్విస్ట్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప సీక్వెల్ పై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతూ ఉండటంతో సుకుమార్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.తాజాగా రష్మిక పుష్ప సీక్వెల్ పై స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ చేసారు.ఇంస్టాగ్రామ్ వేదికగా రష్మిక తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ పుష్ప సినిమాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు.మీరు చూపిన ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడేలా చేస్తుంది అని పోస్ట్ చేసారు రష్మిక.పుష్ప సీక్వెల్ మరింత గొప్పగా,అద్భుతంగా ఉంటుంది అని మేము వాగ్దానం చేస్తున్నాము అని రష్మిక తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *