ఓటిటీ లో రిలీజ్ అయినా కూడా థియేటర్లలో తగ్గని పుష్ప జోరు…30 డేస్ కలెక్షన్స్ ఇవే….

పుష్ప ఇటీవలే ప్రముఖ ఓటిటీ అయినా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.ఓటిటీ లో రిలీజ్ అయినా కూడా థియేటర్లలో ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి.హిందీలో అయితే అంచనాలకు మించి కలెక్షన్స్ వస్తున్నాయి.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంకు విడుదల అయినా తర్వాత అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.తెలుగుతో పాటు మిగిలిన భాషలలో కూడా అనుకోని విధంగా కలెక్షన్స్ దక్కించుకుంది ఈ చిత్రం.మొదటి వారం తర్వాత కొంచెం స్లో అయినా కూడా మూడవ వారంలో బాగా పుంజుకుంది.

విడుదల అయినా 30 వ రోజు కూడా 12 లక్షల షేర్స్ ను తెలుగు రాష్ట్రాలలో రాబట్టుకుంది పుష్ప.పుష్ప సినిమాకు అదిరిపోయే ఓటిటీ ఆఫర్ రావడంతో అనుకున్న టైం కంటే ముందే ఈ సినిమాను జనవరి 7 న ఓటిటీ లో రిలీజ్ చేసారు.హిందీ వెర్షన్ లో కూడా ఇటీవలే ఓటిటీ లో రిలీజ్ చేసారు.అయినా కూడా హిందీలో ఇంకా మంచి వసూళ్లు రాబట్టుకుంటుంది ఈ చిత్రం.

హిందీ,తమిళ్,మలయాళంలో అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయి.ఇప్పటివరకు పుష్ప కలెక్షన్స్ ఇవే…నైజం:40 .62 cr ,సీడెడ్:15 .06 cr ,ఉత్తరాంధ్ర:8 .09 cr ,ఈస్ట్:4 .88 cr ,వెస్ట్:3 .94 cr ,గుంటూరు:5 .29 cr ,కృష్ణ:4 .24 cr ,నెల్లూరు:3 .08 cr ,ఏపీ మరియు తెలంగాణ:85 .03 cr ,తమిళనాడు:11 .32 cr ,కర్ణాటక:11 .56 cr ,కేరళ:5 .49 cr ,ఓవర్సీస్:14 .47 cr ,రెస్ట్ అఫ్ ఇండియా:41 .25 cr ,వరల్డ్ వైడ్:171 .25 cr .పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరింగింది.ఇప్పటి వరకు ఈ సినిమాకు 170 cr షేర్లు వచ్చాయి.తెలుగులో 102 cr షేర్ వసూలు చేయాల్సి ఉంది.తెలుగులో ఇంకా సేఫ్ అవ్వడానికి 15 కోట్ల షేర్లు రావలసి ఉంది.పుష్ప ఓటిటీ లో రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ ఆగిపోయాయి.తెలుగులో తప్పించి అన్ని చోట్ల పుష్ప సేఫ్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *