Home సినిమా పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో,హీరోయిన్లు ఎవరో తెలుసా…

పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో,హీరోయిన్లు ఎవరో తెలుసా…

0

సినిమా కథలో కానీ పాత్రలలో కానీ మార్పులు చేర్పులు అనేవి సర్వసాధారణం.మొదటగా కథను రాసే సమయంలో దర్శకుడు హీరోగా ఒకరిని ఊహించుకోవడం వాళ్ళు నో చెప్పడంతో మరొకరిని తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి.కొన్ని కారణాల వలన సినిమా స్టార్ట్ చేసే ఆఖరి సమయంలో కూడా హీరోలు మారడం,పాత్రలు మారడం వంటివి కొన్ని కొన్ని సార్లు జరుగుతుంటాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు,సుకుమార్ దర్శకత్వం లో వన్ నేనొక్కడినే సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

వన్ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ మహేష్ బాబు కోసం పుష్ప కథను రాయడం జరిగింది.సుకుమార్ పుష్ప కథను మహేష్ బాబుకు వినిపించడం కూడా జరిగింది.మహేష్ బాబు కు కథ నచ్చకపోవడంతో అదే సినిమాను అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత అందరిని బాగా ఆకట్టుకుంది.దాంతో సుకుమార్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మొదటగా సమంత ను అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వలన సమంత రిజెక్ట్ చేయడంతో రష్మిక ఆ ఛాన్స్ ను దక్కించుకున్నారు.

పుష్ప సినిమాలో ఊ అంటావా..ఉహు అంటావా అనే స్పెషల్ సాంగ్ తో ఒక ఊపు ఊపిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఐటెం సాంగ్ కోసం మొదటగా బాలీవుడ్ భామలు అయినా దిశా పటాని,నోరా ఫతేహి ను అనుకున్నారట.కానీ నోరా ఫతేహి భారీగా డిమాండ్ చేయడంతో సమంత ఈ సాంగ్ కు ఓకే చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకుంది.చివరగా పుష్ప సినిమాలో విలన్ పాత్ర అయినా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మొదట విజయ్ సేతుపతి ని అనుకున్నారు.కానీ విజయ్ డేట్స్ అడ్ జస్ట్ కాకపోవడంతో ఆయన నో చెప్పడం జరిగింది.అలాగే నారా రోహిత్ కూడా విలన్ పాత్రలో చేయనున్నారు అనే వార్త బాగా వైరల్ అయ్యింది.కానీ చివరకు మలయాళ హీరో అయినా ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో బాగా అలరించటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here