పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ వెన్నంటే ఉండే కేశవ పాత్ర చేసింది ఎవరు…అంత పెద్ద ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా…

NEWS DESK
2 Min Read

అల్లు అర్జున్,సుకుమార్ కంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప.ఈ చిత్రం శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు తన ఖాతాలో వేసుకుంటుంది.ఈ సినిమా లో కేశవ అనే ఒక పాత్ర ఎల్లప్పుడూ అల్లు అర్జున్ పక్కనే ఉంటూ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా ఈ కేశవ అనే పాత్ర చేసిన నటుడు ఎవరు…ఇదివరకు ఏ సినిమాలలో చేసాడు అంటూ చర్చ బాగానే జరుగుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందాన కంటే కూడా పెద్ద క్యారెక్టర్ చేసాడు కేశవ.కేశవ పాత్ర చేసిన నటుడి పేరు జగదీష్ ప్రతాప్ బండారి.సాధారణంగా చెప్పాలంటే సినిమా మొత్తం హీరో పక్కన చేయడానికి మంచి గుర్తింపు ఉన్న నటులనే తీసుకుంటారు దర్శకులు.కానీ సుకుమార్ మాత్రం కొత్త నటుడిని తీసుకోని సక్సెస్ సాధించాడు.

ఇదివరకు కూడా సుకుమార్ రంగస్థలం చిత్రంలో హీరో రామ్ చరణ్ పక్కన జబర్దస్త్ కమెడియన్ అయినా మహేష్ కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.అలాగే ఇప్పుడు కూడా పుష్ప సినిమాలో సుకుమార్ కొత్తదనం కోసం కేశవ అనే పాత్రకు జగదీష్ ను తీసుకున్నారు.ఇప్పటి వరకు జగదీష్ ను తెలుగు ప్రేక్షకులు ఇదివరకు ఏ సినిమాల్లోనూ చూడలేదు.కానీ పుష్ప సినిమా చూసిన తర్వాత మాత్రం జగదీష్ కు మంచి గుర్తింపు వచ్చింది.అయితే పుష్ప సినిమాకి ముందు జగదీష్ కొన్ని సినిమాలలో మాత్రమే కనిపించిన గుర్తింపు మాత్రం రాలేదు.కరుణ కుమార్ తెరకెక్కించిన పలాస చిత్రంలో నటించాడు జగదీష్.

అలాగే ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమాలో కూడా జగదీష్ చిన్న పాత్రలో కనిపించడం జరిగింది.ఈ సినిమా అంతగా విజయం సాధించలేక పోయింది కానీ అదే సమయంలో సీమ యాసలో అద్భుతంగా మాట్లాడే జగదీష్ ను సుకుమార్ గుర్తించాడు.పుష్ప సినిమా కూడా పూర్తిగా యాసలోనే సాగుతుంది కాబట్టి సుకుమార్ జగదీష్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చాడు.తనను నమ్మి అంత పెద్ద పాత్ర ఇచ్చిన సుకుమార్ నమ్మకాన్ని నిలబెట్టాడు జగదీష్.ఈ సినిమాలో జగదీష్ హీరో పక్కనే ఉంటూ అప్పుడప్పుడు హీరో పైనే సెటైర్లు వేస్తూ మంచి టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తర్వాత జగదీష్ కు మంచి అవకాశాలు వస్తాయని కచ్చితంగా చెప్పచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *