తగ్గేదేలే అంటున్న పుష్ప ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా శుక్రవారం రోజు రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్స్ కు పైగా పుష్ప సినిమాను రిలీజ్ చేసారు.కొన్ని చోట్ల పుష్ప సినిమా రిలీజ్ శనివారానికి వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన కూడా మరికొన్ని చోట్ల మాత్రం ఎక్స్ట్రా షోస్ కూడా వేయడంతో ఈ సినిమా ఫస్ట్ డే నే భారీ టార్గెట్ రీచ్ అయ్యిందని సమాచారం.

మొత్తానికి పుష్ప ఫస్ట్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా 47 .50 కోట్లు రాబట్టింది.బన్నీ కెరీర్ లో ఇది హైయెస్ట్ అని చెప్పచ్చు.భారీగా ప్రేక్షకుల అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం అంచనాలను అందుకోగలిగిందనే  చెప్పాలి.ప్రేక్షకులు సినిమా లెన్త్ విషయంలో కొంత నిరాశ చెందుతున్నారు.

పుష్ప మూవీ సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే దగ్గర దగ్గరగా 50 కోట్లు కలెక్షన్స్ సాధించింది.వీకెండ్ కల్లా 70 శాతం బిజినెస్ లో రావాలని ప్లాన్ చేస్తున్నారట.అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా రావడంతో వీకెండ్స్ లో కూడా ఈ చిత్రం కల్లెక్షన్స్ ల మోత మోగిస్తుందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *