Home » సినిమా » పుష్ప లో అనసూయ తమ్ముడిగా చేసింది ఎవరు…ఇంతకీ ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..

పుష్ప లో అనసూయ తమ్ముడిగా చేసింది ఎవరు…ఇంతకీ ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో  వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్ పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.సినిమా రిలీజ్ అయినా తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.పుష్ప సినిమా ఏపీ లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది.ఇక హిందీలో అయితే బాహుబలి,సాహో వంటి చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది.పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడానికి పుష్ప టీం ఏ విధంగా కష్టపడ్డారో తెలుస్తుంది.అందుకు మొత్తం టీం ను అభినందించవచ్చు.

ఈ సినిమా లో చేసిన పాత్రలకు కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది.సునీల్,అనసూయ తో పాటు అనసూయ తమ్ముడిగా చేసిన మొగిలిస్ పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది.నోట్లో బ్లేడు పెట్టుకొని మొగిలిస్ చూపించిన విలనిజం ఇంకా భయపడుతున్నాడు వీడు అంటూ చెప్పే డైలాగ్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.ఇటీవలే పుష్ప చిత్రం ఓటిటీలో కూడా రిలీజ్ అయ్యి మంచిగా దూసుకుపోతుంది.దాంతో మొగిలిస్ పాత్ర చేసిన నటుడు ఎవరు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది.

మొగిలిస్ పాత్ర చేసిన నటుడి పేరు రాజ్ తిరందాసు.ఈ సినిమాకు ముందు రాజ్ తిరందాసు కొత్త పోరడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు.కొత్త పోరడు వెబ్ సిరీస్ ఆహ ఓటిటీ లో రిలీజ్ అయ్యి మంచి స్పందన రాబట్టుకుంది.వెబ్ సిరీస్ లో అతని నటనను చూసి సుకుమార్ అతనిని పుష్ప సినిమాలో తీసుకున్నారు.ప్రస్తుతం రాజ్ తిరందాసు నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న 18 పేజెస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి కూడా సుకుమార్ ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *