రెండు తెలుగు రాష్ట్రాలలో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందంతో అభినయంతో బుల్లితెర మీద ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అనసూయ సినిమాలలో కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది.రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్ర చేసిన సంగతి అందరికి తెలిసిందే.రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.గ్లామర్ తోనే కాకుండా అనసూయ తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని సినిమా యూనిట్ కూడా చాల సార్లు ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే పుష్ప మొదటి భాగంలో అనసూయ పాత్ర అంత కొత్తగా ఏమి లేదు అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం కనిపించింది కొన్ని సీన్ లలో అయినా కూడా నటన అద్భుతంగా ఉందని కూడా స్పందిస్తున్నారు.అయితే అనసూయ పాత్ర మొదటి భాగంలో కంటే కూడా రెండవ భాగంలో కీలకం అని దర్శకుడు సుకుమార్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.ఈ సినిమాకుగాను అనసూయ పారితోషకం ఏ స్థాయిలో తీసుకుని ఉంటుందో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఒక్క రోజుకు అనసూయ 1 .5 లక్షల తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాకుగాను ఆమె ఒక వారానికి పైగానే కాల్షీట్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు.మొత్తం మీద అనసూయ 12 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకు పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.పుష్ప రెండవ భాగం షూటింగ్ ఇంకా పూర్తి కావలసి ఉంది.అయితే రెండవ భాగం పుష్ప ది రూల్ వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నారట.