పుష్ప నుంచి సమంత ఊ అంటావా…ఊహు అంటావా సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం పుష్ప ది రైజ్.డిసెంబర్ 17 న క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే పుష్ప ట్రైలర్ రిలీస్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయ్యిన పాటలు,గ్లిమ్ప్స్ కూడా ప్రేక్షకులలో భారీగా అంచనాలను పెంచుతున్నాయి.ఈ చిత్రం లో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు.

ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అవడం జరిగింది.అయితే ఈ సాంగ్ లో అల్లు అర్జున్,సమంత మాస్ స్టెప్పులతో ఇరగదీశారని వార్తలు వస్తున్నాయి.ఊ అంటావా,ఊహు అంటావా అనే పాటకు సమంత బ్లు కలర్ టాప్ లో బన్నీ మాస్ స్టెప్పులతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు.

అయితే ఈ పాటను డిసెంబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్  దీనికి సంబంధించిన పోస్టర్ ను మాస్ పార్టీ కి సిద్ధం కండి..సిజ్లింగ్ సాంగ్ అఫ్ ది ఇయర్ అంటూ రిలీజ్ చేసారు.ఈ చిత్రం లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తున్నారు.యాంకర్ అనసూయ మరియు సునీల్ విభిన్న పాత్రలలో కనిపించనున్నారు.ఇక సమంత అల్లు అర్జున్ ల సిజ్లింగ్ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఒక్క రోజు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *