పుష్ప ఫాన్స్ కు గుడ్ న్యూస్…ఓటిటీలో ప్రసారం అయ్యేది ఎప్పుడంటే…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కంబినేషన్లో ఇటీవలే రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం పుష్ప ది రైజ్.అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం.ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి భాగం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రెండో భాగం మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.పుష్ప రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో పుష్ప ఓటిటి రిలీస్ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

అయితే ఏదైనా సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఆరు వారాలకు ఓటిటి రిలీజ్ ఉంటుంది.అయితే ఇంత త్వరగా పుష్ప ఓటిటి లో వస్తుందా అంటూ బన్నీ ఫాన్స్ ఆశ్చర్య పోతున్నారు.పుష్ప సినిమా థియేటర్లలో చూసే థ్రిల్ బాగుంటుందని అందుకే కొన్ని రోజులు పుష్ప ఓటిటి రిలీజ్ వాయిదా వేయాలని కోరుతున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఓటిటి నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.అల్లు అరవింద్ తన ఓటిటి అయినా ఆహ లో రిలీజ్ చేస్తారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

మరోపక్క ప్రముఖ ఓటిటి అయినా అమెజాన్ ప్రైమ్ పుష్ప రైట్స్ ను తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి.ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ భారీగానే ఆఫర్ చేసిందని సమాచారం.వచ్చే సంవత్సరం జనవరి చివరి వారంలో పుష్ప ఓటిటి లో రిలీజ్ కానుందని చెప్తున్నారు.దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.మరో పక్క పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిత్రం.ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ టూర్ లో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *