రెండు తెలుగు రాష్ట్రాలలో అనసూయ భరద్వాజ్ పేరు వినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.తన యాంకరింగ్ తో అందరిని మెస్మరైస్ చేసే అనసూయ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను,వీడియొ లను షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది.ఇటీవలే తన గ్లామర్ డోస్ ను పెంచిన అనసూయ తన డాన్స్ వీడియోలతో అందరి మతి పోయేలా చేస్తుంది.జీలో అనే స్పెషల్ షో లో అనసూయ తన డాన్స్ తో అదరకొట్టేసింది.
ఇక ఈ వీడియోలో అనసూయ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ హాట్ హాట్ గా కనిపించింది అని చెప్పచ్చు.వెండితెరపై కూడా గ్లామర్ షోలు చేస్తూ దర్శకులు,నిర్మాతలకు గట్టి సంకేతాలే పంపుతుంది అనసూయ భరద్వాజ్.ఇక ఆమె సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో డి గ్లామర్ పాత్రలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.
బుల్లితెర మీద టీవీ షోలతో పాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది అనసూయ.అయితే ప్రస్తుతం ఈమె సుకుమార్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే పుష్ప రెండవ భాగంలో నటిస్తుంది.ఈ సినిమాతో పాటు ఆమె మరో రెండు సినిమాలకు కూడా ఓకే చేసినట్టు సమాచారం.ప్రస్తుతం అనసూయ చేసిన డాన్స్ వీడియొ నెట్టింట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.