ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్ థియేటర్లలో విడుదల అయ్యి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.ఇక ఈ చిత్రం తర్వాత రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం రెడీ అవుతున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రముఖ రచయితా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు.మహేష్ బాబు,రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ సినిమా అయినా ప్రిడేటర్ మ్యాట్రిక్స్ తరహాలో సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని జోడించి స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించబోతున్న్నారని సమాచారం.జేమ్స్ బాండ్ 007 సినిమాకు మించి ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రం లో రాజమౌళి హీరో మహేష్ బాబు రా ఏజెంట్ పాత్రలో చూపించబోతున్నారని సమాచారం.టైం ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో హై లెట్ గా చూపించబోతున్నారని సమాచారం.శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకం పై డా.కె ఎల్ నారాయణ రూ.400 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది ఇలా ఉండగా మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా వస్తున్నా సర్కారు వారి పాట చిత్రం మే 12 న రిలీజ్ కానుంది.