Home సినిమా మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా…ఇక ఫ్యాన్స్ కు పండగే…

మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా…ఇక ఫ్యాన్స్ కు పండగే…

0

ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్,ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటన కనపరిచారు.అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ రోజు ఈ విషయం గురించి ఒక క్లారిటీ రానుందని సమాచారం.ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకధీరుడు రాజమౌళి హాజరుకానున్నారు.ఈ ఫంక్షన్ లో రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.రాజమౌళి,మహేష్ బాబు సినిమా తర్వాత చిరంజీవి తో సినిమా ఉండవచ్చని సమాచారం.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.

అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఆచార్య టీం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఆచార్య ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగనుంది.ఇదే ఫంక్షన్ లో రాజమౌళి చిరంజీవి తో సినిమా గురించి ప్రకటించనున్నారని తెలుస్తుంది.అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజముందో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here