దర్శకధీరుడు రాజమౌళికి ఇండియా లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన అడగాలే కానీ ఏ హీరో అయినా కాదనకుండా డేట్స్ ఇస్తారు.ఏ హీరోను అడిగిన కూడా తమకు రాజమౌళి తో వర్క్ చేయాలనీ ఉందని చెప్తుంటారు.అంత క్రేజ్ ఉన్న దర్శకుడికి ఏ హీరోతో పని చేయాలనీ ఉంది…ఏ హీరో కు డైరెక్ట్ చేయడం అంటే ఇష్టం…ఆయన మనసులో ఉన్న మాస్ ఎవరు..ఏ హీరోతో సినిమా చేయాలనీ రాజమౌళి బాగా కోరుకుంటున్నారు…అనే దానికి ఇటీవలే సమాధానం దొరికిందని చెప్పచ్చు.హీరోకు ఉన్న క్రేజ్ ముందు ఎంతటి దర్శకుడు అయినా బలాదూర్ అని చెప్తుంటారు.కానీ అది తప్పని తన సినిమాలతో నిరూపించారు దర్శకధీరుడు రాజమౌళి.
రాజమౌళి సినిమా అంటేనే చాలు హీరో ఎవరు అని కూడా చూడకుండానే థియేటర్స్ కు క్యూ కడతారు ప్రేక్షకులు.మరి దర్శకధీరుడు కు ఉన్న క్రేజ్ అలాంటిది చెప్పచ్చు.అలాంటి దర్శకుడికి ఆ హీరోతో వర్క్ చేయాలనే కోరిక అలానే ఉందట.ప్రతి దర్శకుడికి కూడా తమకు నచ్చిన హీరోతో వర్క్ చేయాలి అనే కోరిక ఉంటుంది.అయితే తాజాగా రాజమౌళి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతున్నారు.అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.ఇక సౌత్ భాషల్లో ఈ సినిమాను రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు.నాగార్జున,అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చెన్నైలో ఈ సినిమా ప్రొమోషన్ భాగం గా అక్కడి మీడియా నుంచి రాజమౌళి కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది అని చెప్పచ్చు.అయితే మీడియా వాళ్లు రాజమౌళికి మీరు తమిళ్ లో ఏ హీరోతో సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు అని అడిగిన వెంటనే రాజమౌళి రజనీకాంత్ తో అని చెప్పడం జరిగింది.సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే కోరిక ఉంది అంటూ ఈ సందర్భంగా రాజమౌళి మీడియా ముందు తన మనసులోని మాటను బయట పెట్టారు.రజనీకాంత్ తో వర్క్ చేయడం తన డ్రీం అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.అయితే దీనికి సరైన కథ,సరైన టైం అవసరమని చెప్పుకొచ్చారు.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.కానీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వర్క్ అవుట్ అయితే మాత్రం అతి పెద్ద సెన్సేషన్ అని చెప్పచ్చు.