బాలయ్య,అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో…షాక్ లో ఆ హీరో అభిమానులు…

తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ.బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఇటీవలే చేసినా అఖండ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అఖండ సంచలన విజయం తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.
ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా టీసర్,పోస్టర్ లు ఈ సినిమా పై భారీగానే అంచనాలు పెంచుతున్నాయి.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.బాలయ్య కోసం అదిరిపోయే కథను రెడీ చేసారు అనిల్ రావిపూడి.
ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరో అయినా రాజశేఖర్ ను రంగంలోకి దింపాలని అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నారని సమాచారం.హీరోగా చేస్తూనే విలన్ కూడా చేయడానికి రెడీ గా ఉన్నానని ఇప్పటికే రాజశేఖర్ అనౌన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం రాజశేఖర్ ను విలన్ గా అనిల్ రావిపూడి ఒప్పించినట్లు సమాచారం.తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం.ఈ చిత్రం లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *