రజనీకాంత్ శివాజీ సినిమాలో అక్కాచెల్లెళ్లు బయట యెంత అందంగా ఉంటారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే….

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్  కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో శివాజీ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా ఇప్పటికి కూడా టీవిలో ప్రసారమైతే ఆసక్తిగా చూసే ప్రేక్షకులు చాల మంది ఉన్నారు.శివాజీ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.అన్ని భాషలలో సూపర్ హిట్ అయినా ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.బ్లాక్ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ డైలాగ్స్,ఎమోషనల్,మాస్ ఎలిమెంట్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు.ఈ చిత్రంలో హీరో రజనీకాంత్ కు జోడిగా శ్రీయ నటించారు.

ఈ చిత్రంలో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలు అక్కమ్మ,జక్కమ్మ.ఈ చిత్రంలో రజనీకాంత్ శ్రీయ ను ప్రేమిస్తారు.కానీ శ్రీయ కుటుంబసభ్యులు నో చెప్పడంతో దీపావళి పండుగా సందర్భంగా హీరో తన కుటుంబ సభ్యులతో హీరోయిన్ ఇంటికి వెళ్లడం జరుగుతుంది.అయితే హీరోయిన్ కుటుంబసభ్యులు వాళ్ళను ఇంటి నుంచి బయటకు పంపించడంతో వెంటనే హీరోయిన్ ఇంటి ముందే ఉండే ఒక వ్యక్తి తన ఇంటికి రావాలని ఆహ్వానిస్తాడు.నాకు అక్కమ్మ జక్కమ్మ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు మాతో పరిచయం పెంచుకోండి అంటాడు.

అక్కమ్మ జక్కమ్మ ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలలో కనిపిస్తారు.అయితే సినిమాలో ఫన్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళను అలా చూపించినట్లు సమాచారం.అయితే నిజంగానే వారిద్దరూ బయట అలాగే ఉంటారా అని చాల మందికి అనుమానం వచ్చింది.అక్కమ్మ జక్కమ్మ పాత్రలలో కనిపించిన అమ్మాయిలు బయట చాల అందంగా ఉంటారు.కేవలం సినిమా కోసమే వాళ్ళు అలా నటించినట్లు వాళ్ళ లేటెస్ట్ ఫోటోలు చుస్తే అర్ధమవుతుంది.ఇటీవలే వీళ్లకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.ఆ ఫోటోలను చుసిన నెటిజన్లు అక్కమ్మ జక్కమ్మ బయట చాల అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *