ఈమధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు కనిపిస్తూనే ఉన్నాయి.ఇలా తమకు ఇష్టమైన సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు చూసేందుకు తమ అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తుంటారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు చాల మంది నటి నటుల చిన్ననాటి ఫోటోలు మనకు దర్శనం ఇచ్చాయి సోషల్ మీడియాలో.తాజాగా ఇప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.చిన్నప్పటి ఫొటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న హీరోయిన్ ఎవరో కాదు వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయినా రకుల్ ప్రీత్ సింగ్.
ఈ ముద్దు గుమ్మ తన మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని కరెంటు తీగ,నాన్నకు ప్రేమతో,లౌక్యం,ధ్రువ వంటి పలు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.అయితే ఇటీవలే ఈమె నటించిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమనడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి.దాంతో ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలు ఎంచుకోవడంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తుంది.రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా కొండపొలం అనే చిత్రంలో నటించింది.క్రిష్ ఈ చిత్రాన్ని 40 రోజుల్లోనే పూర్తి చేశారట.ఈ చిత్ర ఎక్కువ బాగా వికారాబాద్ లోని అడవిలో చిత్రీకరించినట్లు సమాచారం.ఈ మధ్య కాలంలో విడుదల అయినా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబుళమ్మ అనే డీగ్లామర్ పాత్రలో నటించారు.