సినిమాల్లో అవకాశాలు కొంత తగ్గుతున్నా సోషల్ మీడియాలో మాత్రం హంగామా చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె పోస్టులు అభిమానులు, సినీ ప్రేక్షకులు, నెటిజెన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాయి. తన అంద చందాలతో మెస్మరైజ్ చేస్తుంది ఈ పంజాబీ బ్యూటీ. టాలీవుడ్ లో ‘కెరటం’తో ఎంట్రీ ఇచ్చిన రకుల్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో ఆమె నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. లైక్యం, నాన్నకు ప్రేమతో, కరెంట్ తీ, ధ్రువ, కిక్-2, మన్మథుడు 2, స్పైడర్, తదితర చిత్రాల్లో నటింటి ప్రేక్షకుల మన్ననలు కూడా దక్కించుకుంది.
దాదాపుగా ఈ తరం అగ్ర కథా నాయకులతో జతకట్టి మంచి ఫేమ్ సంపాదంచుకుంది రకుల్. అందాలను ఆరబోయడంలో ఎలాంటి సందేహం లేదంటోంది ఈ బ్యూటీ. గ్లామర్ పాత్రలు పోషిస్తూ కుర్రకారును తన వైపునకు తిప్పుకుంటుంది. తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వరుసగా వస్తున్న పరాజయాలతో రెట్టించిన జోరుతో తన గ్లామర్ ను కాపాడుకుంటూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ మూవీస్ చేస్తుంది.
సోషల్ మీడియా వేదికపై కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఆన్ లైన్ మాద్యమాలు ట్విటర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో ఆమె వదిలే పోస్టులు నెటిజన్లను చూపుమరల్చుకోనివ్వడం లేదంటే సందేహం లేదు. ఆమె ఫొటోలు నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ గా మారుతున్నాయి. తన అందంతో నెట్టింట మెస్మరైజ్ చేస్తూందీ బ్యూటీ.

తాజాగా హాట్ బికినీ ధరించి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హాలిడే లో ఎంజాయ్ చేస్తూ ‘థాంక్ గాడ్ ఫర్ హాలిడే’ అంటూ ట్యాగ్ లైన్ జత చేసి వదిలిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి హాట్ డోస్ పెంచడంతో వెర్రెక్కిపోతున్నారు కుర్రకారు. క్యూట్ లుక్స్ తో ఉన్న ఫొటోలు చూసి ఫిదా అవుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు కామెంట్లు కూడా అదే తరహాలో పడుతున్నాయి.

రకుల్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు బాలీవుడ్ లో ‘డాక్టర్ జీ’, ‘ఛత్రీవాలీ’ రిలీజ్ కు సద్ధంగా ఉన్నాయి. సరైన అవకాశాలు లభించక టాలీవుడ్ కు దూరంగా ఉన్న పంజాబీ క్వీన్ బాలీవుడ్ లో మాత్రం హల్ చేస్తోంది. తెలుగులో చివరగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ‘కొండపొలం’లో చేసింది. టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు తన వైపు ప్రసరించేలా సోషల్ మీడియా వేదికగా కవ్విస్తోంది పంజాబీ బ్యూటీ.కెరీర్ కాస్త స్లో కావడంతో రకుల్ కీలక నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో కాస్త సడలింపు కూడా ఇచ్చారట పంజాబీ బ్యూటీ. డెయిలీ పేమెంట్స్ విధానంలోకి కూడా వచ్చిందని ఈ భామ.
View this post on Instagram