తన కెరీర్ లో ఇప్పటివరకు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఏవో తెలుసా…

తెలుగు ఇండస్ట్రీ కి మెగా వారసుడిగా పరిచయమయ్యి ప్రస్తుతం తనకంటూ ఒక స్టార్ డమ్ ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ఆ తర్వాత రాజమౌళి,రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర చిత్రం యెంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు.

సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయిందని చెప్పచ్చు.ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ చిత్రం మార్చ్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే మెగా స్టార్ చిరంజీవి,రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం కూడా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.హీరో రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు పది సినిమాలు వదులుకున్నారు.అవి ఏంటంటే…

లీడర్:లీడర్ చిత్ర కథను ముందుగా దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో రామ్ చరణ్ కు వినిపించారు.తనకు ఈ కథ సూట్ కాదని రామ్ చరణ్ రిజెక్ట్ చేయడం జరిగింది.

డార్లింగ్:ముందుగా దర్శకుడు ఈ చిత్రం కథను రామ్ చరణ్ కు వినిపించడం జరిగింది.అయితే రామ్ చరణ్ ఈ కథకు ప్రభాస్ అయితే బాగుంటుంది అని చెప్పడంతో ఈ సినిమా ప్రభాస్ తో చేయడం జరిగింది.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్:గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం కథను ముందుగా రామ్ చరణ్ కు వినిపించారు.అయితే అదే టైములో రామ్ చరణ్ మగధీర చిత్రంతో బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు.

ఎటో వెళ్ళిపోయింది మనసు:ఈ కథను దర్శకుడు గౌతమ్ మీనన్ ముందుగా హీరో రామ్ చరణ్ కు వినిపించారు.కానీ కథ నచ్చకపోవడంతో రామ్ చరణ్ ఈ కథను రిజెక్ట్ చేసారు.ఆ తర్వాత హీరో రామ్ ఈ కథను ఓకే చేసారు.కానీ కొన్ని కారణాల వలన రామ్ ఈ కథ నుంచి తప్పుకోవడంతో హీరో నాని ఈ చిత్రాన్ని ఓకే చేసారు.

కృష్ణం వందే జగద్గురుమ్:ఈ కథను క్రిష్ ముందుగా వెంకటేష్ కు వినిపించారు.హీరో వెంకటేష్ ఫైనల్ అయ్యాక కొన్ని కారణాల వలన వెంకటేష్ చేయలేక పోయారు.ఆ తర్వాత క్రిష్ ఈ కథను రామ్ చరణ్ కు వినిపించారు.కానీ రామ్ చరణ్ కు ఈ కథ నచ్చకపోవడంతో ఈ కథను రిజెక్ట్ చేసారు.

శ్రీమంతుడు:ముందుగా ఈ చిత్ర కథను కొరటాల చరణ్,ఎన్టీఆర్,బన్నీ కి వినిపించారు.కానీ వాళ్ళు నో చెప్పడంతో మహేష్ బాబు ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

మనం:విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముందుగా హీరో రామ్ చరణ్ కు వినిపించారు.ఆ తర్వాత చాల మంది హీరోల దగ్గరకు ఈ కథ వెళ్ళింది.చివరకు అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

కృష్ణార్జున యుద్ధం:ఈ చిత్రం కథను ముందుగా దర్శకుడు హీరో రామ్ చరణ్ కు వినిపించారు కానీ రామ్ చరణ్ రిజెక్ట్ చేయడంతో ఇదే కథను నాని చేయడం జరిగింది.

నెల టికెట్:ముందుగా దర్శకుడు ఈ చిత్రం కథను రామ్ చరణ్ కు వినిపించారు.కథ నచ్చక పోవటంతో రామ్ చరణ్ నో చెప్పడం జరిగింది.

ఓకే బంగారం:ఈ చిత్రం కథను కూడా ముందుగా రామ్ చరణ్ కు వినిపించారు దర్శకుడు.ఇంత క్లాసిక్ కథ తనకు సూట్ అవ్వదని రామ్ చరణ్ రిజెక్ట్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *