Ram Charan- Upasana: ఈ ఏడాది జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.దింతో మెగా కుటుంబం లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి.ఒకపక్క మనవరాలి రాకతో చిరంజీవి,సురేఖ సంబరాలు జరుపుకుంటే మరోపక్క మెగా ప్రిన్సెస్ రాకతో మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు.ఆ తర్వాత రామ్ చరణ్ దంపతులు గిరిజనులు,చెంచుల సమక్షంలో బారసాల వేడుక నిర్వహించి పాపకు క్లిన్ కార కొణిదెల అని నామకరణం చేసారు.
అందరు సెలెబ్రెటీలు లాగానే రామ్ చరణ్ దంపతులు కూడా తమ గారాల పట్టి విషయం లో చాల గోప్యత పాటిస్తున్నారు.ఈ క్రమంలోనే తమ గారాల పట్టి ముఖాన్ని ఇంత వరకు చూపించలేదు రామ్ చరణ్ దంపతులు.ఇక మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఇక తమ కూతురి ప్రైవసీ విషయంలో రామ్ చరణ్ దంపతులు దృఢ నిశ్చయంతో ఉన్నారని అందుకే ఇప్పటి వరకు తమ కూతురి ఫోటోలు బయటకు రానివ్వలేదు అని వినిపిస్తుంది.
అయితే తాజాగా రాంచరణ్ కూతురు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇవి రియల్ ఫోటోలు కాదని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సహకారం తో కొందరు క్లిన్ కార ఫోటోలను అద్భుతంగా డిసైన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ చేతుల్లో ఉన్న క్లిన్ కారం ఏఐ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం రామ్ చరణ్ దంపతులు ఇటీవలే ఇటలీ వెళ్లారు.రామ్ చరణ్ స్వయంగా వరుణ్ పెళ్లి పనులను దగ్గరుండి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇక రామ్ చరణ్ గేమ్ చెంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
View this post on Instagram