Home సినిమా ఆర్ ఆర్ ఆర్ లోని రాంచరణ్ ఎంట్రీ సీన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో నుంచి...

ఆర్ ఆర్ ఆర్ లోని రాంచరణ్ ఎంట్రీ సీన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో నుంచి కాపీ కొట్టారు అని మీకు తెలుసా…

0

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా జక్కన్న రాజమౌళి చిత్రం ట్రిపుల్ ఆర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రముఖ ఓటిటీ లో కూడా రిలీజ్ అయినా ఈ చిత్రం అక్కడ కూడా బాగా రాణిస్తుంది.పేపర్ వ్యూ విధానంతో ఓటిటీ లో రిలీజ్ అయినా ఈ చిత్రం అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పచ్చు.వేల మంది నిరసనకారుల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం అద్భుతంగా ఉందని చెప్పచ్చు.అయితే ఇలాంటి సీన్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో చేసేసాడు అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ సీన్ కు సంబంధించిన వీడియొ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశాలలో హీరో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కూడా ఒకటి.బ్రిటిష్ ఆఫీసర్ ఆదేశం మేరకు రామ్ చరణ్ వేల మంది నిరసనకారుల మధ్యలో దూకి ఒక్కడిని పట్టుకొస్తాడు.ఈ సన్నివేశం తెరకెక్కించడానికి రాజమౌళి కొన్ని రోజులు రీసెర్చ్ చేసి సహజంగా అనిపిస్తూ సీరియస్ నెస్ రావడానికి బాగా కష్టపడ్డారు.జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో 2011 లో ఊసరవెల్లి అనే సినిమా రిలీజ్ అయింది.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ డబ్బులు ఇస్తే ఎవరినైనా కొట్టే కిరాయి రౌడీగా పనిచేస్తుంటాడు.ఈ క్రమంలో ఒకడిని కొట్టడానికి ఎన్టీఆర్ వందల మందిలోకి దూకి ఫైట్ చేస్తారు.ఊసరవెల్లి సినిమాలోని ఈ ఫైట్ సీన్ ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఫైట్ సీన్ ఒకే విధంగా పోలి ఉంటాయి.ఎన్టీఆర్ కూడా ఆ సీన్ రామ్ చరణ్ మాదిరిగానే వందల మందిలోకి రాడ్ తీసుకోని దూకి టార్గెట్ పర్సన్ కోసం వెతుకుతూ ఉంటాడు.ఈ వీడియొ ను ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here