కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ప్లాప్ అవుతాయి.కానీ కొన్ని కొన్ని సార్లు ప్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.అలాగే సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో కెరీర్ లోను హిట్ అవుతుంది అనుకున్న సినిమా ప్లాప్ అయినా సందర్భం ఒక్కటైనా ఉంటుంది.అలాగే హీరో రామ్ పోతినేని విషయంలో కూడా జరిగిందని చెప్పచ్చు.తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో ఇటీవలే రామ్ పోతినేని హీరోగా చేసిన చిత్రం ది వారియర్.
ఈ చిత్రంలో రామ్ కు జోడి గా కృతి శెట్టి నటించడం జరిగింది.ఇక ఈ చిత్రం భారీ అంచనాలతో జులై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ అనుకోని విధంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని చెప్పచ్చు.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించారు దర్శకుడు లింగస్వామి.రెండు భాషలలోను రిలీజ్ అయినా ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.

ఈ సినిమాలో రామ్ మొదటి సరిగా పోలీస్ పాత్రలో నటించడం జరిగింది.అయితే ఈ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన రామ్ పోతినేని తన దగ్గరకు వచ్చిన నాలుగు పోలీస్ కథలలో ఈ కథను ఒకే చేసినట్టు చెప్పుకొచ్చారు.లింగస్వామి వినిపించిన ఈ కథ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసాడు రామ్ పోతినేని.రామ్ రిజెక్ట్ చేసిన నాలుగు కథలలో ఒక బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన సినిమా క్రాక్ సూపర్ హిట్ అయ్యింది.అయితే క్రాక్ సినిమా కథను గోపీచంద్ ముందుగా రామ్ కు వినిపించారు.కానీ రామ్ నో చెప్పడంతో రవితేజ కు వినిపించారు గోపీచంద్.ఇలా రవితేజ చేసిన క్రాక్ సినిమా వసూళ్లు కురిపించింది.అలా రామ్ పోతినేని సూపర్ హిట్ సినిమా అయినా క్రాక్ ను మిస్ చేసుకున్నారు.ఇక హిట్ అవుతుంది అనుకున్న ది వారియర్ సినిమా పరాజయం పొందింది.
