ఇటీవలే కాలంలో సోషల్ మీడియా వేదికగా చాల మంది నటి నటుల చిన్ననాటి ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.ఇదే క్రమంలో సాయి పల్లవి,కీర్తి సురేష్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.అలాగే నటి నటులు కూడా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు,లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ అన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.అలాగే కాసేపు సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తమ అభిమానులతో కూడా ముచ్చటిస్తున్నారు నటి నటులు.
ఇటీవలే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.అభిమానులు నేషనల్ క్రష్ గా పిలుచుకునే ఈ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందాన.నాగ సౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రష్మిక మందాన.ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
వరుసగా సరిలేరు నీకెవ్వరూ,భీష్మ వంటి చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందాన అక్కడ రెండు సినిమాలలో నటిస్తున్నారు.అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను అయితే మరొకటి గుడ్ బై.అలాగే తెలుగులో కూడా త్వరలోనే రష్మిక పుష్ప 2 చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు.