Home న్యూస్ Skanda : స్కంద సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ హీరోయిన్

Skanda : స్కంద సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ హీరోయిన్

0

Skanda: రామ్ పోతినేని పవర్ ఫుల్ పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా స్కంద.ది వారియర్ సినిమా తర్వాత స్కంద సినిమాతో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ గురువారం థియేటర్ లలో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రామ్ కు జోడిగా శ్రీలీల నటించింది.అయితే దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల కంటే ముందు వేరే హీరోయిన్ ను సంప్రదించారట.

రష్మిక మందాన ను ఈ సినిమా లో హీరోయిన్ గా అనుకున్నారట దర్శకుడు బోయపాటి.అయితే రష్మిక పలు కారణాలతో ఈ సినిమాను రిజెక్ట్ చేయడం తో శ్రీలీల చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.హీరో రామ్ పోతినేని ఈ సినిమా లో పవర్ ఫుల్ మాస్ క్యారక్టర్ లో ఇరగదీసారు.మొదటి రోజే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్లకు పైగా షేర్ లు రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తో దూసుకుపోతుంది.ఇక రష్మిక మందాన గురించి చెప్పాలంటే ఈ కన్నడ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.

Skanda

వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే వారసుడు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.ఇక తెలుగు లో రష్మిక రైన్ బో,పుష్ప ది రూల్ సినిమాలలో నటిస్తుంది.ఇక బాలీవుడ్ లో ఈమె సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న యానిమల్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరో గా నటిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రలో అలరించనుంది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.శేఖర్ కమ్ముల,ధనుష్ కాంబినేషన్ లో D 51 అనే టైటిల్ తో వస్తున్నా సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here