ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరైన రష్మిక మందాన పుష్ప సినిమా తో ఆల్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు తమిళ్,హిందీ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది.ప్రస్తుతం రష్మిక కు వరుస సినిమా అవకాశాలు కూడా బాగా తలుపుతడుతున్నాయి.అయితే యెంత సినిమాలతో బిజీ గా ఉన్న కూడా రష్మిక మందాన సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,సినిమా అప్ డేట్స్ లను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు రష్మిక.
అయితే ప్రస్తుతం రష్మిక తన సెక్యూరిటీ గార్డ్ మీద సీరియస్ అయినా వీడియొ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఎప్పుడు నవ్వుతూ ఉండే రష్మిక తన సెక్యూరిటీ గార్డ్ మీద సీరియస్ ఎందుకు అయిందని అనుకుంటున్నారా.వివరంగా చెప్పాలంటే…ఈ వీడియోలో రష్మిక షూటింగ్ సెట్ నుంచి క్యారవాన్ లోకి వెళ్తున్న సమయంలో ఆమెతో కొందరు అభిమానులు సెల్ ఫీ దిగడానికి ప్రయత్నించారు..అక్కడున్న అభిమానులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి సెల్ఫీ లు దిగారు.
వారందరితో ఎంతో చిరునవ్వుతో ఫోటోలు దిగారు రష్మిక.అదే సమయంలో మరొక అభిమాని సెల్ఫీ దిగడానికి వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి అని సెక్యూరిటీ గార్డ్ అతనిని ఆపేయడంతో సెక్యూరిటీ గార్డ్ మీద రష్మిక సీరియస్ అవ్వడం జరిగింది.ఆ తర్వాత అతనితో సెల్ఫీ దిగి రష్మిక అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఈ వీడియొ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.సౌత్ స్టార్స్ డౌన్ తో ఎర్త్ అహంకారం లేదు అంటూ రష్మిక పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.
View this post on Instagram