ఇటీవలే హీరోయిన్ రష్మిక మందాన పేరు నెట్టింట్లో ఏ విధంగా ట్రోలింగ్ అవుతుందో అందరికి తెలిసిందే.నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్ ఇటీవలే పలు వివాదాలలో ఇరుక్కొని ట్రోలింగ్ కు గురవుతుంది.తాజాగా కూడా ఈమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అయింది.రీసెంట్ గా రష్మిక మందాన కోలీవుడ్ స్టార్ హీరో అయినా విజయ్ దళపతి కి జోడిగా ఒక సినిమా చేస్తుంది.వారిసు అనే పేరుతొ తమిళ్ భాషలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
టాలీవుడ్ దర్శకుడు వంశి పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.తాజాగా సినిమా యూనిట్ ఈ సినిమాలోని ఒక పాటను కూడా రిలీజ్ చేసారు.తమిళ్ లో రంజితమే అనే పాటను సినిమా యూనిట్ ఇటీవలే రిలీజ్ చేసారు.యూట్యూబ్ లో ఈ పాట లక్షల్లో వ్యూస్,వేళల్లో లైకులతో దూసుకుపోతుంది.యూట్యూబ్ లో ఈ పాట సూపర్ హిట్ గా మంచి ఆదరణ దక్కించుకుంటుంది.
ఒక పక్క ఈ పాట సూపర్ హిట్ అయినా మరోపక్క ఈ పాట ట్రోలింగ్ కు గురవుతుంది.దీనికి కారణం రష్మిక ఒక కాలికి పట్టి ఉండి మరొక కాలికి పట్టి లేకపోవడమే.మూవీ మేకర్స్ కాస్ట్యూమ్స్ పరంగా యెంత శ్రద్ధ తీసుకున్న కూడా ఆమె కుడికాలికి పట్టి లేకపోవడాన్ని గమనించలేదు.దాంతో నెటిజన్లు ఇంత చిన్న విషయాన్నీ ఎలా నిర్లక్ష్యం చేసారు అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.