అందరు కష్టపడి సంపాదించేది అన్నం కోసమే.అలాంటి అన్నాన్ని దైవంతో భావిస్తారు అందరు.హిందూ సంప్రదాయం ప్రకారం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అంటారు.అయితే అలాంటి అన్నం విషయంలో కొన్ని జాగ్రత్తలు,నియమాలు పాటించాలి అని చాల మంది చెప్తుంటారు.కొంత మంది భోజనం చేసిన తర్వాత తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.ఇలా చేసే పొరపాట్ల వలన ఇంట్లో సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.
చాల మంది తమ ఇళ్లలో రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలను అలాగే ఉంచేసి తర్వాతి రోజు ఉదయం శుభ్రం చేస్తారు.ఇలా చేసే వారి ఇంట్లో లక్ష్మి దేవి అస్సలు నిలువకుండ దరిద్రం వాటిల్లుతుంది అని నిపుణులు చెప్తున్నారు.అందుకే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలను శుభ్రం చేసి పాడుకోవాలి.ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాటిని మరుసటి రోజు ఉదయం శుభ్రం చేద్దాం అని వాయిదా వేయకూడదు.అయితే చాల మంది చేసే మరొక పొరపాటు భోజనం చేసిన తర్వాత ఆ పళ్లెం లో నీళ్లు పోయకుండా చేతులు వెళ్లి బయట కడుగుతారు.
ఇలా తిన్న తర్వాత పళ్లెం లో నీళ్లు పోయకపోవడం అశుభానికి సంకేతం అని నిపుణులు చెప్తున్నారు.అందుకే భోజనం చేసిన వెంటనే అదే పళ్లెంలో నీళ్లతో చేతులు కడిగి వెంటనే పళ్లెం శుభ్రం చేసుకోవాలి.చాల మంది భోజనం ఒక చోట కూర్చొని పద్దతిగా తినకుండా అటు ఇటు తిరుగుతూ తింటారు.అలా తిరుగుతూ భోజనం చేయడం వలన అన్నపూర్ణ దేవిని అవమానించినట్లు అని చాల మంది చెప్తుంటారు.