Bala Krishna: ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం పేరుతొ హీరో గా,హీరోయిన్లుగా సెటిల్ అయినా వాళ్ళు చాల మందే ఉన్నారు.తాతల పేర్లు చెప్పుకొని కొంత మంది అలాగే నాన్నల పేర్లు చెప్పుకొని కొంత మంది ఇప్పటికే తమ పిల్లలను సైతం సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు నందమూరి కుటుంబం నుంచి ఒక్క అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకపోవడం అందరు గమనించే ఉంటారు.దానికి కారణం ఏంటి అనే దాని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుంది.చిరంజీవి కుటుంబం నుంచి నిహారిక హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే అక్కినేని కుటుంబం నుంచి కూడా నాగార్జున మేనకోడలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలోనే నందమూరి కుటుంబం నుంచి ఒక్క అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది.అయితే నందమూరి బాలకృష్ణ కు ఏ సమస్య లేదని కానీ వాళ్ళకే గ్లామర్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదనే వార్త వినిపిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే నారా బ్రాహ్మణి కి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదని.ఆమె ఫోకస్ మొత్తం ఎప్పుడు బిజినెస్ మీదనే ఉంటుందని తెలుస్తుంది.బాలయ్య చిన్న కూతురు తేజస్విని కి కూడా సినిమా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని చెప్తున్నారు.ఇలా బాలకృష్ణ కూతుర్లు తెరపై కనిపించడానికి ఇష్టపడరు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఏది ఏమైనా సరే బాలకృష్ణ పెంపకం సూపర్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.