Ritika Singh: విక్టరీ వెంకటేశ్ సినిమా ‘గురు’ గుర్తుండే ఉంటుంది కదా. ఇందులో యాక్ట్ చేసి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నదే ఈ హీరోయిన్.. ఈ మూవీలో అనేక మంది ఈ అమ్మాయి ఎవరా..? అంటూ గూగుల్ లో సెర్చ్ చేశారంటే అతిశయోక్తి కాదు. క్రమంగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది ఆమెనే రితికా సింగ్. ‘నీనెవరో’ (2018) చిత్రంలో నటించిన రితికా సింగ్ బ్రూస్ లీ హీరో అరుణ్ విజయ్ తో కలిసి ‘బాక్సర్’ అనే మరొక స్పోర్ట్స్ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మూవీకి వివేక్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇది మంచి స్పోర్ట్స్ డ్రామా కాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రాన్ని తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ఇది తెలుగులోకి కూడా డబ్ చేసే యోచనలో ఉన్నారంట చిత్ర దర్శకుడు, నిర్మాత. వియోన్ జేమ్స్ (కాంచన-2)కు సంగీతంలో ఈ మూవీ రాబోతోంది. ఈ ఏడాది చివరలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం కూడా స్పోర్ట్స్ బేసిక్ రానుంది.
రితికా సింగ్ ఇండియన్ యాక్టర్. ఈమె మాజీ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్టు కూడా. నార్త్ నుంచి సౌత్ వరకు మంచి సినిమాలు (స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్) ఎంపిక చేసుకుని మరీ చిత్రాలు తీస్తుంది. ఆసియన్ ఇండోర్ గేమ్స్-2009లో భారత్ తరుఫున బరిలో దిగి సూపర్ ఫైట్ లీగ్ లో పాల్గొంది. తర్వాత మాధవన్ తో కలిసి సుధా కొంగర ప్రసాద్ డైరెక్షన్ చేసిన తమిళ చిత్రం ఇరుధి సుత్రులో ప్రధాన పాత్ర పోషించింది.

తన నటనా జీవితాన్ని 2013లో ప్రారంభించింది రితికా. ఆమె సూపర్ ఫైల్ లీడ్ కోసం ఒక ప్రకటనలో దర్శకురాలు సూధా కొంగర ప్రసాద్ తో మెప్పు పొంది సాలా ఖాదూస్ లో మేయిన్ రోల్ లో నటించింది. చెన్నైలోని మురికివాడలోని మార్వాడీ అమ్మాయి ‘మాధి’ పాత్రలో నటించేందుకు రితికా సింగ్ ను చిత్ర యూనిట్ సంప్రదించింది. ప్రొఫెషనల్ బాక్సర్ గా నటించాలని యూనిట్ కోరిక మేరకు ఆమె నటించింది.
ఈ చిత్రం 2016లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు దక్కించుకుంది. ఆమె నటనా, అభినయం, ఫైట్స్ సీన్స్ లో ఆమె నటించే విధానంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇరుధి సుట్రలో తన నటనకు రితికా 63వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ప్రత్యేక ప్రస్తావనను గెలుచుకుంది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న మొదటి నటిగా కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది రితికా సింగ్.
