ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా…

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రిలీజ్ అయినా మొదటి షో తోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.రిలీజ్ అయినా మొదటి రోజు ఈ చిత్రం బాహుబలి 2 కలెక్షన్లను అధిగమించింది.బాహుబలి కి మించిన కథ,కథనంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.విజువల్ ఎఫెక్ట్స్ ను మొదలుకొని యాక్షన్ ఘట్టాల వరకు అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు రాజమౌళి.

దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో,హీరో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో తమ నటవిశ్వరూపాన్ని చూపించారు.బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్,అలియా భట్ ముఖ్యపాత్రాలలో అలరించారు.అయితే మొదట ఆర్.ఆర్.ఆర్ కథ అనుకున్నప్పుడు రాజమౌళి అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం పాత్రలలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ను అనుకోలేదట.

ఈ రెండు పాత్రల కోసం రాజమౌళి మొదట చాల కాంబినేషన్లు అలోచించారట.ఆ రెండు పాత్రల కోసం అల్లు అర్జున్-ఎన్టీఆర్,కార్తీ-సూర్య,కార్తీ-అల్లు అర్జున్ ఇలా రకరకాల కాంబినేషన్లను రాజమౌళి అలోచించారట.చివరకు రామ్ చరణ్-ఎన్టీఆర్ అయితే బాగుంటుందని ఫైనల్ చేసినట్టు రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సెంథిల్ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *