రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్.ఈ చిత్రం మార్చ్ 25 న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాంతో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.విడుదల అయినా మొదటి రోజే ఈ చిత్రం బాహుబలి 2 కలెక్షన్లను అధిగమించింది.ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.
అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ చిత్రానికి ఎవరి రెమ్యూనరేషన్ యెంత అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.డి వి వి దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబడింది.ఈ చిత్రానికి 900 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం.ఇక సినిమా కోసం హీరోలకు,హీరోయిన్లకు,దర్శకుడికి భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో మరియు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ చిత్రం కు గాను రామ్ చరణ్ కు మరియు ఎన్టీఆర్ కు 45 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు 25 కోట్లు మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు 9 కోట్లు ఇస్తున్నారని సమాచారం.దర్శకుడికి లాభాల్లో 30 శాతం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి.