ఆర్ ఆర్ ఆర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా…

రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఇటీవలే విడుదల అయ్యి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఇప్పటికే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం రెండో వీకెండ్ కూడా భారీగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా మరియు ఎన్టీఆర్ కొమరం భీం గా అద్భుతంగా నటించారు.అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించారు.ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో ఆలియా భట్ సీత పాత్రలో కనిపించడం జరిగింది.

సినిమాలో ఆలియా భట్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమా ఎండ్ లో టైటిల్స్ లో వచ్చే పాటలో స్టెప్పులు వేసి సందడి చేసింది.ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటించడం జరిగింది.ఈ సినిమా లో ఒలీవియా జెన్నిఫర్ అనే పాత్రలో కనిపించారు.ఈమె పాత్రకు కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది.సినిమాలో ఈమె లుక్స్ కూడా బాగున్నాయి అని చెప్పచ్చు.ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం మొదట రాజమౌళి వేరే హీరోయిన్లను అనుకోవడం జరిగింది.

ఈ సినిమా లో సీత పాత్ర కోసం రాజమౌళి మొదటగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ను అనుకోవడం జరిగింది.కానీ ఆమె అదే టైం లో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పలేదు.ఇక సినిమాలో జెన్నిఫర్ పాత్ర కోసం మొదట డైసీ ఎడ్గార్ జోన్స్ అనే ఇంగ్లీష్ అమ్మాయిని అనుకుంటున్నట్లు రాజమౌళి అధికారికంగా చెప్పడం జరిగింది.కొన్ని ఫ్యామిలీ కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *