Home సినిమా ఆర్ ఆర్ ఆర్ లో మల్లి పాత్రలో నటించిన చిన్నారి ఎవరు…అంత మంచి అవకాశం ఎలా...

ఆర్ ఆర్ ఆర్ లో మల్లి పాత్రలో నటించిన చిన్నారి ఎవరు…అంత మంచి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా…

0

జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఇటీవలే మార్చ్ 5 న థియేటర్లలో విడుదల అయ్యింది.రిలీజ్ అయినా మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకొనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఆర్ ఆర్ ఆర్.ఇక ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన పరంగా మరొక మెట్టు పైకి ఎదిగారని చెప్పచ్చు.సీతారామరాజు,కొమరం భీం పాత్రలలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని చూపించడం జరిగింది.

వీరిద్దరి తో పాటు ఈ సినిమాలో గుర్తుండిపోయే మరొక పాత్ర మల్లి.ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చుసిన మల్లి అనే పాత్రలో నటించిన చిన్నారి గురించే చర్చ జరుగుతుంది.సినిమాలో మల్లి అనే పాత్ర ఉండేది కొంచెం సేపే అయినా కూడా ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాలో మల్లి పాత్రకు ఉన్నవి చిన్న చిన్న సన్నివేశాలే అయినా కూడా ప్రేక్షకుల దృష్టిని తనవైపు ఆకట్టుకోగలిగింది,ఈ చిత్రం లో మల్లి పాత్రకు ఫిదా అయినా ప్రేక్షకులు ఆ చిన్నారి ఎవరు…ఇంతకూ ఆర్ ఆర్ ఆర్ లో నటించే గొప్ప అవకాశం ఎలా వచ్చింది అంటూ చర్చిస్తున్నారు.మల్లి పాత్రలో అలరించిన చిన్నారి అసలు పేరు ట్వింకిల్ శర్మ.ఇదివరకు ఈ చిన్నారి డాన్స్ ఇండియా అనే కాంపిటీషన్ లో పాల్గొంది.ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ ద్రమేబెజ్ షో లో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.

హిందీ చానెల్స్ లో ప్రసారం అయ్యే ఎన్నో ఈవెంట్స్ లో కూడా ట్వింకిల్ శర్మ పాల్గొంది.వీటితో పాటు ఫ్లిప్కార్టు లో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రకటనలో కూడా నటించింది ఈ చిన్నారి.రాజమౌళి దృష్టిలో పడిన ఈ చిన్నారి ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా చిత్రం లో నటించే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రంలో కథ మలుపు తిప్పే కీలక పాత్రలో ఈ చిన్నారి అందరిని అలరించింది.దాంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది ట్వింకిల్ శర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here