మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్.ఇప్పటికే ఈ సినిమాకు చాల రిలీజ్ డేస్ ప్రకటించిన కూడా చివరకు ప్రపంచవ్యాప్తంగా నిన్న మార్చ్ 25 న రిలీజ్ అయింది.భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి సినిమా చూడడానికి థియేటర్లకు ఎగబడుతున్నారు ప్రేక్షకులు.రాజమౌళి సినిమాలకు టాక్ తో సంబంధం ఉండదు అని ఈ సినిమాతో మరోసారి రుజువయింది.
జక్కన్న కూడా బాహుబలి కి మించి ఈ సినిమా ఉంటుంది అని మొదటి నుంచి ప్రమోట్ చేయడంతో ఈ సినిమా కు మొదటి రోజు కలెక్షన్లు బాహుబలి 2 సినిమా కంటే కూడా ఎక్కువగా వచ్చాయి.ఇక హిందీ లో మాత్రం ట్రిపుల్ ఆర్ బాహుబలి 2 రికార్డును సాధించలేకపోయింది.
ఇక ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…నైజాం:23 .30 cr ,సీడెడ్:17 .00 cr ,ఉత్తరాంధ్ర:07 .40 cr ,ఈస్ట్:5 .35 cr ,వెస్ట్:5 .93 cr ,గుంటూరు:7 .80 ,కృష్ణ:4 .20 cr ,నెల్లూరు:3 .10 cr ,ఏపీ మరియు తెలంగాణ:73 .99 cr ,తమిళనాడు:4 .92 cr ,కేరళ:1 .71 cr ,కర్ణాటక:8 .13 cr ,నార్త్ ఇండియా:9 .25 cr ,ఓవర్సీస్:34 .00 cr ,రెస్ట్:3 .50 cr ,టోటల్ వరల్డ్ వైడ్:135 .50 cr .తెలుగుతో పాటు అన్ని వెర్షన్స్ లో ఈ చిత్రానికి రూ.492 cr థియరిటికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కోసం రూ.500 కోట్లు షేర్లు రాబట్టాలి.ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే 135 .50 cr రాబట్టింది.ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.236 cr కొల్లగొట్టింది.మొదటి రోజు బాహుబలి 2 సాధించిన గ్రాస్ కలెక్షన్స్ రూ.215 కోట్లను ట్రిపుల్ ఆర్ చిత్రం అధిగమించింది.హిందీ,కర్ణాటక,కే