సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా చాల మంది సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు వైరల్ అవుతున్నాయి.ఇదే క్రమంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలోని చాల మంది స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అభిమానులు కూడా తమ ఇష్టమైన నటీనటులు చిన్ననాటి ఫోటోలు చూడడానికి చాల ఆసక్తి చూపిస్తుంటారు.ఇక సెలెబ్రెటీలు కూడా తమకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు లేటెస్ట్ గా ఒక టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి క్యూట్ గా ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.స్కూల్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో హీరో వరుణ్ కు జోడిగా నటించింది.మొదటి సినిమాతోనే తన నటనతో,డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది సాయి పల్లవి.
న్యూచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం దగ్గుపాటి రానా కు జోడిగా విరాట పర్వం అనే చిత్రం లో నటిస్తుంది.వేణు ఉడుగులా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో ప్రియమణి,నందితాదాస్,నవీన్ చంద్ర,ఈశ్వరి రావు,నివేద పేతురేజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.నక్సలిజానికీ ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.