Sai Pallavi: చెల్లెలి నిశ్చితార్ధం లో మాస్ డాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి…వీడియొ వైరల్

NEWS DESK
1 Min Read
Sai Pallavi

Sai Pallavi: తాజాగా హీరోయిన్ సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్ధం వినీత్ తో ఘనం గా జరిగింది.గత కొంత కాలం నుంచి పూజ కన్నన్,వినీత్ లు ప్రేమించుకుంటున్నారు.ఈ విషయాన్నీ పూజ తన(Pooja Kannan) ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది.వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తెలియజేసింది పూజ.

దాంతో సాయి పల్లవి(Sai Pallavi) ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.ఈ క్రమంలోనే పూజ,వినీత్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.ఈ వేడుకలో సాయి పల్లవి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు,స్నేహితులు హాజరయ్యారు.సాయి పల్లవి ఈ వేడుకలో తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సందడి చేసింది.

Sai Pallavi

పూజ,వినీత్ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు,వీడియొ లు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.సాయి పల్లవి చెల్లెలు పూజ కూడా సినిమాలలో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.తమిళ్ లో పూజ చిత్తిరై సెవ్వనం అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో సముద్ర ఖని కూడా ముఖ్య పాత్రలో కనిపించడం జరిగింది.

Also read : త్వరలో సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు…కాబోయే భర్తను పరిచయం చేస్తూ పోస్ట్.!

ఈ సినిమా తర్వాత పూజ కు అవకాశాలు రాకపోవడంతో సాయి పల్లవి కి మేనేజర్ గా ఉంటుంది.షూటింగ్ తేదీలను నిర్వహించడం,ప్రమోషన్ లు ఇలా అన్నింటిలోనూ అక్కకు తోడుగా ఉంటుంది పూజ.ఇక పెళ్లి తర్వాత కూడా అక్క సాయి పల్లవి కి మేనేజర్ గా కొనసాగుతుందో లేదో చూడాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *