ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీల,నటి నటుల చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ వరకు అన్ని కూడా తెలుస్తున్నాయి.అభిమానులకు ఎంతో చేరువగా ఉంటూ సినిమా తారలు కూడా తమకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు చాల మంది హీరో,హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు సామజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ఒక స్టార్ హీరోయిన్ ముద్దుగా ఉన్న చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతూ వెళ్తుంది.ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు ఏమ్ మాయ చేసావే సినిమాలో తన అందంతో నటనతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత.గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమ్ మాయ చేసావే చిత్రంలో హీరో నాగ చైతన్య కు జోడిగా నటించారు సమంత.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని వరసగా సినిమా అవకాశాలు అందుకున్నారు.ఆ తర్వాత హీరో నాగ చైతన్య ను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.కానీ కొన్ని కారణాల వలన నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోని విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు.

సమంత,నయనతార నటించిన కాదు వాక్కుల రెండు కాదల్ అనే చిత్రం ఇటీవలే రిలీజ్ అయ్యింది.ఈ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు.విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోగా నటించారు.తెలుగు లో ఈ కన్మణి రాంబో కథిజగా డబ్ చేయబడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నారు.శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ జోనర్ లో వస్తున్నా ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరెకెక్కనుంది.మలయాళ సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.