సమంత సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో..ఆమె మొదటి జీతం ఎంతో తెలుసా…


ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.హీరోయిన్ సమంత కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏమ్ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకున్నారు సమంత.ప్రస్తుతం తెలుగు,తమిళ్,హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.అయితే సమంత వెబ్ సిరీస్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే సమంత సినిమాలలోకి రాకముందు ఏం చేసేదో చాల మందికి తెలీదు.సమంత మొదటి జీతం ఎంతో కూడా తెలిస్తే అందరు ఆశ్చర్యపోకమానరు.ప్రతి వ్యక్తికీ మొదటి సంపాదన అంటే చాల ప్రత్యేకం.ఇక సెలెబ్రెటీల గురించి అయితే ఇలాంటి విషయాలు అందరికి ఆసక్తిని కలిగిస్తాయి.

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత తన మొదటి జీతం ఉద్యోగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది.సినిమాల్లోకి రాకముందు సమంత ఓ హోటల్ లో పనిచేసేవారట.ఇటీవలే సమంత ఇంస్టాగ్రామ్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.అందులో ఒక అభిమాని సమంత మొదటి ఉద్యోగం,మొదటి జీతం గురించి అడగం జరిగింది.అయితే సమంత ఏమాత్రం ఆలోచించకుండా తన మొదటి ఉద్యోగం మొదటి జీతం గురించి తెలిపారు.అయితే సమంత 10 ,11 తరగతి చదువుకునే సమయంలో హోటల్ లో 8 గంటలు హోస్టెస్ గా పనిచేసేవారట.

హోటల్ సిబ్బంది రూ.500 జీతంగా ఇచ్చేవారని సమంత తెలిపారు.2010 సంవత్సరంలో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సమంత ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా సమంత కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది.వెబ్ సిరీస్ లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా మొదటి స్తానం లో నయనతార ఉంటె రెండవ స్థానంలో సమంత ఉన్నారు.ఇక పుష్ప సినిమాలో కూడా సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సాంగ్ కోసం సమంత అయిదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *