సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో మరియు హీరోయిన్లకు ఫిట్ నెస్ అనేది చాల అవసరం.హీరోయిన్లు కొంచెం బరువు పెరిగితే చాలు దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు.అందుకే చాల మంది హీరోయిన్లు డబ్బు,ఫేమ్ ఉన్న కూడా ఫిట్ నెస్ కోసం జిమ్ లో చాల కష్టపడుతుంటారు.హీరోయిన్ సమంత ఫిట్ నెస్ కు యెంత ప్రాముఖ్యత ఇస్తుందో అందరికి తెలిసిన విషయమే.ఆమె యెంత సన్నగా ఉన్నప్పటికీ ప్రతి రోజు వ్యాయామం చేస్తూ జిమ్లో కసరత్తులు చేస్తూ తన ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తుంది.ఇటీవలే సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకోని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.
విడాకుల తర్వాత సమంత క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా రిలీజ్ అయినా పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కు ఆమె క్రేజ్ ఉత్తరాదిన కూడా అమాంతంగా పెరిగిపోయింది.విడాకుల తర్వాత సమంత ఛాలెంజింగ్ ఉన్న పాత్రలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయారు.సమంత సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉంటారు.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వార్తలను తన అభిమానులతో షేర్ చేస్తుకుంటారు సమంత.ఇటీవలే తాజాగా సమంత జిమ్లో కసరత్తు చేస్తున్న వీడియొ ఒకటి తన ఖాతాలో పోస్ట్ చేసారు.
జిమ్లో తన ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో సమంత కసరత్తు చేస్తూ చమటలు చిందిస్తున్నారు.విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఫోకస్ మొత్తం తన కెరీర్ మీద పెట్టినట్లు తెలుస్తుంది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె హాలీవుడ్ సినిమా అయినా అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ చిత్రంలో బై సెక్సువల్ పాత్రను చేస్తున్నారు.అలాగే కాతువాక్కుల రెండు కాదల్ అనే చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారని సమాచారం.ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం లో విజయ్ సేతుపతి,నయనతార ప్రేమకు అడ్డుపడి కథను మలుపు తిప్పే పాత్రలో సమంత చాల అద్భుతంగా నటించారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram