నాగ చైతన్య, సమంత జంట అతి కొద్ది కాలంలోనే విడిపోయారు. ఆ తర్వాత సమంతపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. మొదటి వారి డైవర్స్ గురించి అనేక రూమర్లు వినిపించినా, వాటిలో కొన్నింటికి వారు బాహాటంగానే జవాబులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె పునర్వివాహం అంటూ వెలువడుతున్న న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది. ఇటీవల సద్గురు ఆమె కోసం ఒక సంబంధం కూడా చూశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత డీప్రెషన్ లో ఉండగా ఈ గురువే ఆమెను ఆధ్యాత్మికం వైపు నడిపి బాగు చేశాని, ఆయన చొరవతోనే రెండో పెండ్లికి ఒప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పెండ్లి కొడుకును సద్గురు చూశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పెండ్లికి, సద్గురువుకి సంబంధం లేదని సమంత సన్నిహితులు చెప్తున్నాయి. ఆమెకు పెండ్లి చేసుకునే ఆలోచనలే లేదని చెప్తున్నా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా సమంత తన ఫ్యామిలీకి అత్యంత సన్నితుడైన ఒక వ్యక్తిని పెండ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. అతనిది కూడా రెండో పెండ్లేనంట. మొదటి భార్యకు విడాలు ఇచ్చిన అతను సింగిల్ గానే ఉంటున్నాడని న్యూస్ లీకైంది.

అతని గురించి తెలుసుకున్న సమంత అతన్నే పెండ్లి చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపుతుందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే నవంబర్ 4న ఆమె హీరోయిన్ గా చేసిన ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర యూనిట్. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. 11న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలు కూడా చేయబోతోంది. ఏది ఏమైనా ఆమె పెండ్లి టాపిక్ మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.