Sanghavi: ఫ్యామిలీతో శ్రీవారిని దర్శించుకున్న సంఘవి..వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫొటోస్.!

sanghavi

Sanghavi: సీనియర్ హీరోయిన్ సంఘవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సంఘవి ఈ రోజు తన ఫ్యామిలీ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.సంఘవి తన భర్త వెంకటేష్,కూతురితో కలిసి శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.వేదపండితులు సంఘవి కుటుంబానికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు అందించారు.పట్టు వస్త్రంతో ఆలయ అధికారులు వారిని సత్కరించి తీర్థప్రసాదాలను సంఘవి కుటుంబానికి అందించారు.ఆ తర్వాత సంఘవి తన ఫ్యామిలీతో కలిసి ఆలయంలో ఫోటోలు దిగారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక్కప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంఘవి దాదాపు 18 సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.సంఘవి( Sanghavi ) సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఆక్టివ్ గా ఉండరు.కానీ ఎప్పుడో ఒకసారి ఆమె ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి.1993 లో రిలీజ్ అయినా అమరావతి అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు సంఘవి.తెలుగుతో పాటు,కన్నడ,తమిళ్ సినిమాల్లో కూడా నటించి సంఘవి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

శ్రీకాంత్( Srikanth ) హీరోగా 1995 లో రిలీజ్ అయినా తాజ్ మహల్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు సంఘవి.కానీ ఈ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించారు.ఆ తర్వాత సంఘవి 1997 లో రిలీజ్ అయినా సింధూరం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా సంఘవి కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అని చెప్పచ్చు.ఇక ఆమె తెలుగులో చివరగా ఒక్కడే కాని ఇద్దరు అనే సినిమాలో కనిపించారు.ఆ తర్వాత సంఘవి వెంకటేష్ ను పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్నారు.ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *