సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే…పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏవో తెలుసా…

ప్రతి పండుగకు ఒక విశిష్టత అనేది తప్పకుండ ఉంటుంది.అలాగే సంక్రాంతి పండుగకు కూడా చాల ప్రాముఖ్యత ఉంది.హిందువులు జరుపుకునే అన్ని పండుగలలో సంక్రాంతి పండుగా కూడా చాల ముఖ్యమైనది.సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున జరుపుకుంటారు.అయితే మన దేశంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను జనవరి నెల 14 లేదా 15 తేదీలలో జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ రోజున మాత్రం కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదు అని నిపుణులు చెప్తున్నారు.సంక్రాంతి పండుగకు చాల మంది ఉపవాసం ఉంటారు.ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత పండుగ రోజున కిచిడి తింటే మంచిదట.అలాగే పండుగ రోజున నువ్వులు తో చేసిన లడ్డులతో పాటు నువ్వు కలిపినా నీటిని తాగితే ఆరోగ్యానికి చాల మంచిది అని నిపుణులు చెప్తున్నారు.అలాగే సంక్రాంతి పండుగ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే చాల మంచిదట.ఇలా దానం చేయడం వలన శని దేవుడు ప్రసన్నం అవుతాడు అని పురాణాలలో చెప్పబడింది.

అదే విధంగా మకర సంక్రాంతి రోజున నది స్నానం చేయడం కూడా మంచిదట.ఒకవేళ నదీస్నానం కుదరకపోతే నువ్వులను నీటిలో వేసి స్నానం చేస్తే మంచిదట.పండుగరోజున ఉపవాసం ఉండాలి అని అనుకున్నవారు పూజకు ముందు ఎలాంటి ఆహరం కూడా తీసుకోకూడదు.చాల మందికి మద్యం తాగే అలవాటు ఉంటుంది.అలా మద్యం తాగే అలవాటు ఉన్నవారు పండుగ రోజు మాత్రం మద్యానికి దూరంగా ఉంటె మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే పండుగా రోజున దానాలు చేస్తే చేస్తే చాల మంచిదట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *