Home రివ్యూలు Sardar Telugu Movie Review: సర్ధార్ మూవీ రివ్యూ ఇంతకీ సినిమా ఎలావుందంటే…

Sardar Telugu Movie Review: సర్ధార్ మూవీ రివ్యూ ఇంతకీ సినిమా ఎలావుందంటే…

0
Sardar Telugu Movie Review
Sardar Telugu Movie Review

Sardar Telugu Movie Review: తమిళ హీరో ‘కార్తి శివకుమార్ (కార్తీక్)’ చేయబోయే సినిమాల కథల ఎంపికలో డిఫరెంట్ స్టయిల్ వెతుక్కుంటాడు. యుగానికి ఒక్కడు నుంచి  రీసెంట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ వరకు ఆయన స్టయిలే వేరు. పొన్నియిన్ సెల్వన్ వేడి తగ్గక ముందే తమిళ, తెలుగు ప్రేక్షకులకు మరో హిట్ తో హీట్ పెంచాడు. అభిమన్యుడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఆయన నటించిన సర్ధార్ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలరే సినీ అభిమానులను సినిమా హాల్ వరకు తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. 

ఇక కథ విషయానికి వస్తే హీరో కార్తీక్ విజయ్ ప్రకాశ్ అనే పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఒక సీక్రెట్ ఫైల్ మిస్సవుతుంది. అందులో భారత సైనికాదళానికి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఇక అప్పటి నుంచి కథలో ట్విస్ట్ మొదలవుతుంది. అసలు ఫైల్ ఎలా మిస్సవుతుంది. రహస్యాలు ఎవరెవరికి చేరుతాయి. వీటిపై సీబీఐ, రా ఇంటరాగేషన్ స్ర్టాట్ చేస్తుంది. ఫైల్ గురించి అంతగా తెలియని విజయ్ ప్రకాశ్ (కార్తీక్) మీడియాలో పాపులారిటీ కోసం ఈ ఫైల్ ను వాడుకుంటాడు. అదే సమయంలో కార్తి తండ్రి (కార్తీక్ డబుల్ రోల్) ఎదురు పడతాడు. అతడు కూడా ఫైల్ కోసం వెతికే మిషన్ లో భాగంగా పని చేస్తుంటాడు. అసలు ఫైల్ ఏంటి..? అందులో ఏం ఉంది.. చివరికి ఏమవుతుందో చూడాలి..

బ్యాంక్ మోసాలు, డిజిటల్ హ్యాకింగ్ ఇలాంటి వాటిని చాలా అందంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పీఎస్ మిత్రన్ స్టయిలే వేరు. విశాల్ హీరోగా చేసిన అభిమన్యుడితో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాజేసే అర్జున్ ను పట్టుకుంటాడు. ఇప్పుడు తీసిన సర్ధార్ గూఢచారి యాంగిల్‌ లో వెళ్తుంది. సస్పెన్స్ గా గూజ్ బంబ్స్ వచ్చేలా సన్నివేశాలను చిత్రీకరించారు డైరెక్టర్. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కట్టి పడేస్తే, ఫ్లాస్ బ్యాక్, సెకండ్ ఆఫ్ మాత్రం కాస్త స్లోగానే ఉంటుంది. క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా చిత్రీకరించారు. లవ్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్ని షేడ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ వేరే లెవలే మరి. ఇటు తండ్రీ, అటు కొడుకులుగా కార్తీక్ ద్విపాత్రాభినయం ఇరగదీశాడు. రాశీకన్నా లాయర్ గా నటించి పర్వాలేదనిపించింది. అందగా ఆకట్టుకోలేకపోయింది. రజిషా, చంకీపాండే, తదితర తారాగణం వారి పరిధి మేరకు నటించారు. 

దేశం కోసం తన లైఫ్ ను త్యాగం చేసిన భారత గూఢచారి జీవిత కథ ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కార్తి ఫర్మార్ మెన్స్ చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్ చాలా వరకు బాగుంది. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా, పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోకున్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా డిటెక్టివ్ సన్నివేశాల్లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సూపర్. ఇక మొత్తంగా చూస్తే గూఢచారి ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. రాశీకన్నా అందంతో ఆకట్టుకున్నా. ఆమె పాత్ర మాత్రం అంతగా ఎలివేట్ కాలేదు. ఇక సిమ్రన్, మునిష్కాంత్, మురళీ శర్మ, విజయన్ లాంటి సీనియర్ యాక్టర్ వారి పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here