సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వం వహించిన చిత్రం సర్కారు వారి పాట ఈ నెల మే 12 న థియేటర్లలో రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ మరియు జీ ఏం బి ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించడం జరిగింది.ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత మొదటి షో తోనే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం జరిగింది.మొదటి వారం ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది.వీక్ డేస్ లో కూడా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం.

సర్కారు వారి పాట చిత్రం మొదటి వారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి..నైజాం:31 .28 cr ,సీడెడ్:10 .40 cr ,ఉత్తరాంధ్ర:10 .50 cr ,ఈస్ట్:7 .80 cr ,వెస్ట్:4 .75 cr ,గుంటూరు:8 .10 cr ,కృష్ణ:5 .57 cr ,నెల్లూరు:3 .25 cr ,ఏపీ మరియు తెలంగాణ:81 .65 cr ,రెస్ట్ అఫ్ ఇండియా:5 .68 cr ,ఓవర్సీస్:11 .44 cr ,వరల్డ్ వైడ్:98 .77 cr .ఈ చిత్రానికి థియరిటికల్ బిజినెస్ రూ 120 కోట్లు జరిగింది.బ్రేక్ ఈవెన్ రావాలి అంటే రూ 121 కోట్లు షేర్లు రాబట్టాలి.ఫస్ట్ వీక్ పూర్తి అయ్యే సరికి ఈ చిత్రం రూ.98 .77 cr షేర్లు రాబట్టింది.