ఈ మధ్యకాలంలో చాల మందిలో ఎక్కువగా కనిపించే సమస్య గ్యాస్ ట్రబుల్.ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యతో చాల మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు.ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లకు వయస్సుతో సంబంధం లేకుండా గ్యాస్ ట్రబుల్ సమస్య చాల మందికి ఇబ్బందికి గురి చేస్తుంది.అయితే గ్యాస్ ట్రబుల్ తగ్గి ఇంకెప్పుడు జీవితంలో రాకుండా ఉండాలి అంటే మన జీవన శైలిని మార్చుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.అవి ఏంటంటే…కొంత మందికి మలబద్దకం ఉంటుంది.
రోజు ఫ్రీ గా మోషన్ కి వెళ్ళలేరు.అలా కాకుండా ప్రతి రోజు ఉదయం ఫ్రీగా మోషన్ కు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.అలా ఫ్రీ గా మోషన్ రావాలి అంటే ప్రతిరోజూ ఉదయం ఒక లీటరు గోరువెచ్చని నీళ్లు తాగాలి.అలాగే బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా గ్యాస్ తగ్గడానికి ఒక పది రోజుల వరకు ఏవైనా ఫ్రూప్ట్స్ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.ఎప్పుడైనా సరే బ్రేక్ ఫాస్ట్,మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి సమయంలో డిన్నర్ చేయడానికి ఒక అర గంట ముందే నీళ్లు తాగాలి.
ఆ తర్వాత తినాలి.తినేటప్పుడు కూడా చాల మందికి మధ్య మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.కానీ అలా మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు అని నిపుణులు చెప్తున్నారు.బ్రేక్ ఫాస్ట్ కానీ భోజనం కానీ డిన్నర్ కానీ తినిన రెండు గంటల తర్వాత నీళ్లు తాగాలి.ఇలా ప్రతి రోజు చేయడం వలన జీర్ణ క్రియ బాగా మెరుగుపడి గ్యాస్ ట్రబుల్ సమస్య ఎప్పటికి రాకుండా ఉంటుంది.