తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు కృష్ణం రాజు.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.కృష్ణం రాజు అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నప్పుడు పెదనాన్న ను పరామర్శించటానికి హీరో ప్రభాస్ హాస్పిటల్ కు వెళ్లిన వీడియొ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AIG హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నటుడు కృష్ణంరాజు ఈ రోజు ఉదయం 3 :25 నిమిషాలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.ఈయన మరణించిన వార్త విని తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.ఈయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కృష్ణంరాజు 1940 జనవరి 20 న పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు లో జన్మించారు.

ఈయన భార్య పేరు శ్యామల దేవి.ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.కృష్ణం రాజు మరణ వార్త ప్రభాస్ కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది.కృష్ణం రాజు చివరిసారిగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రంలో నటించడం జరిగింది.