ఒకే టైటిల్ తో ఎన్టీఆర్,నాగార్జున నటించిన చిత్రాలలో ఏది సూపర్ హిట్ అయ్యిందో తెలుసా…

నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించిన తొలి చితం ఎదురులేని మనిషి 1975 డిసెంబర్ 12 న రిలీజ్ అయ్యింది.అప్పట్లో ఎన్టీఆర్ ఇమేజ్ కు భిన్నంగా దుస్తులు,పాటలు,డాన్స్ లో వైవిధ్యం చూపించడం జరిగింది.శేఖర్ అంటే ఎన్టీఆర్ తండ్రిని తన బాల్యంలో రంగ మరియు సర్కార్ అనే ఇద్దరు దుర్మార్గులు హత్య చేస్తారు.ఆ హత్య చేసిన వాళ్ళను గుర్తించిన శేఖర్ తన తమ్ముడు అయినా గోపితో పారిపోతాడు.ఆ తర్వాత వారిద్దరూ విడిపోవడం జరుగుతుంది.తండ్రిని చంపిన వాళ్ళ మీద పగసాధించాలి అన్న పట్టుదల మరో పక్క తమ్ముడిని ఎలాగైనా కలుసుకోవాలి అని శేఖర్ చూస్తుంటాడు.

ఇక స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకుంటూ తన తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేది మిగిలిన కథ.జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ఎదురులేని మనిషి 2001 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో నాగార్జున,సౌందర్య,షెహనాజ్,నాజర్ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ పతాకంపై నిర్మించడం జరిగింది.ఉరికి పెద్దమనిషి అయినా సూర్యమూర్తి తన తాత,బామ్మా,ఒక పాప తో కలిసి ఉంటాడు.

eduruleni manishi
eduruleni manishi

అతని లాగే ఉండే అతని తమ్ముడు సత్య హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఉరికి వస్తాడు.ఎప్పటికి పెళ్లి చేసుకోను అని అంటున్న తన అన్నయ్య కు ఎలాగైనా పెళ్లి చేయాలి అని సత్య భావిస్తాడు.అయితే ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ మరియు నాగార్జున చేసిన చిత్రాలలో ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.ఇక నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *